దివంగత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషిని నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావేర అనిల్ కుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, భూక్య సజ్జన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉప్పల సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మండల నాయకులు రెడ్డి రాజుల రమేష్, తోటకూరి రమేష్, నరసింహ, రెడ్డి రాజుల యాకన్న, పులి పంపుల సురేష్, మాసంపల్లి మహేందర్, చెన్నూరి రాంబాబు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
అలాగే దౌపటి నర్సయ్య, సుడిగల నరేష్, పానుగంటి ప్రశాంత్, బట్ట యాదగిరి, తీగల కృష్ణ, బుర్ర ప్రభాకర్, శంకర్, అశోక్‌తో పాటు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు లోడంగి అశోక్ యాదవ్, పులిగిల్ల అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.