ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో వద్ద నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఓ భాగం ప్రారంభించిన కేవలం 12 రోజులకే కుంగిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో రహదారి నిర్మాణ నాణ్యత, పనుల పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఉన్నావోలోని 49వ కిలోమీటర్ వద్ద పరిశీలించి, లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. అయితే ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే రహదారి భాగం దెబ్బతినడం ఆందోళనకు గురిచేసింది.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, కుంగిపోవడానికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. లోపాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఎక్స్‌ప్రెస్‌వే భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నట్లు సమాచారం.