నాగర్‌కర్నూల్‌లో అనుమానాస్పద డీఏపీ ఎరువులు సీజ్.. 111 బస్తాలు స్వాధీనం

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో అనుమానాస్పద డీఏపీ ఎరువుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ఇళ్లలో నిల్వ ఉంచిన 111 బస్తాల అనుమానాస్పద డీఏపీ ఎరువులను గుర్తించి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

అధికారులు దర్యాప్తు సందర్భంగా ఇప్పటికే పంట పొలాల్లో వినియోగించిన 39 ఖాళీ డీఏపీ సంచులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎరువుల నాణ్యత, అసలుదనం, సరఫరా మూలాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

సీజ్ చేసిన ఎరువుల నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, నకిలీ ఎరువుల సరఫరాపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.