పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను మళ్లీ ప్రారంభించినట్లు ఆయన అమెరికా కాంగ్రెస్‌కు అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు వార్ పవర్స్ నోటీసును కూడా జారీ చేసినట్లు సమాచారం.
నివేదికల ప్రకారం, జూలై 7 నుంచి సైనిక చర్య ప్రారంభమైనట్లు నోటీసులో పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాలు, విదేశాంగ విధానాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ కాంగ్రెస్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సైనిక చర్య స్వరూపం, లక్ష్యాలు, తదుపరి చర్యలపై అమెరికా ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.