మానవసేవయే మాధవసేవ మానవతా చాటుకున్న 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు మమత.

తేది:18-04-2026, సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

మానవ సేవలోనే మహా ఆనందం-మానవతను చాటుకున్న పులిమామిడి రాజు.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో సొంత నిధులతో కబ్రస్తాన్‌లో బోరుబావి వేహించిన – 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు
సదాశివపేటపట్టణంలోని పాత పెరుమాళ్ళ ఆలయ సమీపంలో జాతీయ రహదారి 65 వద్ద గల ముస్లిం సోదరులకు చెందిన కబ్రస్తాన్ ప్రాంగణంలో చాలా రోజుల నుండి నీటి సమస్య ఉందని, వారు పులిమామిడి రాజును కలిసి చెప్పిన వెంటనే కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు స్పందించి తనసొంత నిధులతో బోరుబావిని వేయించి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు. కబ్రస్తాన్‌కు వచ్చే ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా ఈ బోరు బావి ఉపయోగ పడుతుందన్నారు. ఈ నూతన బోరుబావి ఏర్పాటుతో ప్రస్తుతం అక్కడికి వచ్చే ప్రజలకు మంచి నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా స్థానికులు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు సేవాభావాన్ని అభినందిస్తూ, ప్రజల సమస్యలపై చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని వారిని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కబ్రస్తాన్ కమిటీ సభ్యులు అక్బర్ హుస్సేన్, మక్సుద్, మహమ్మద్ ఫయాజ్, సర్వర్, అన్వర్, పర్వేజ్, హాజీ పటేల్, హర్షద్, రఫీ, జబ్బార్ మరియు పిఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *