ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్ పాలసీతో కుటుంబానికి ఆర్థిక భరోసా – బేగంపేట్ బ్రాంచ్ ద్వారా డెత్ క్లెయిమ్ అందజేత.

తేది:18- 04- 2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజ్గిరి స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.

హైదరాబాద్: ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బేగంపేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, పాలసీదారుడు కానిస్టేబుల్ అల్లూరి తిరుపతి రెడ్డి హార్ట్ ఎటాక్ కారణంగా మరణించగా, ఆయన నామినీ అల్లూరి అఖిల కి డెత్ క్లెయిమ్ మొత్తాన్ని సంస్థ అధికారులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ దుంప వెంకట్ రెడ్డి , సీనియర్ టెర్రిటరీ మేనేజర్ పిగిలి ప్రసాద్ , లైఫ్ మిత్ర రాముల ఆమని ల చేతుల మీదుగా క్లెయిమ్ చెక్కు అందజేయబడింది.
ఈ సందర్భంగా, పాలసీ కింద కేవలం ఒకే ప్రీమియం రూ.1,00,000 మాత్రమే చెల్లించగా, సంబంధిత నార్మల్ డెత్ సమ్ అష్యూర్డ్ రూ.10,00,000 మొత్తాన్ని నామినీకి అందించారు. అదనంగా, ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్ పాలసీ ప్రత్యేకత ప్రకారం, భవిష్యత్తులో చెల్లించాల్సిన మిగతా 4 ప్రీమియంలను సంస్థే భరిస్తుందని తెలిపారు.
పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయ్యే సమయానికి, పూర్తి మెచ్యూరిటీ అమౌంట్‌ను నామినీ (పాప)కు ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందజేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, స్మార్ట్ స్కాలర్ ప్లస్ పాలసీ పిల్లల భవిష్యత్తు భద్రత కోసం రూపొందించబడిన ప్రత్యేక పథకం అని, పాలసీదారుడు లేకపోయినా కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశమని వివరించారు.
నామినీ అల్లూరి అఖిల సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ, క్లెయిమ్‌ను సకాలంలో అందించడం తమ కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగించిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *