తేది:17-04-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ నందు మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.కడపగాండ్ల చక్రవర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ ముఖ్య అతిథులు విశ్రాంత జిల్లా కలెక్టర్,టీటీడి జేఈవో లక్ష్మీకాంతం, విశ్రాంత జడ్జి మధుసూదన్,విశ్రాంత ఎస్పీ ఎస్.ఎం రత్న,మాజి కేంద్రమంత్రి వేణుగోపాచారి,పాత్రికేయులు,సామాజిక నేత నీలాజ్యోతి,దుర్గాభవాని, న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ డా.శివలీల రెడ్డి ల మధ్యన వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా స్వచ్ఛందంగా వివిధ సామాజిక సేవలు మరియు ఆధ్యాత్మికంగా సామాజికంగా చేస్తున్నందుకు విశ్రాంత కలెక్టర్ లక్ష్మీకాంతం,మాజీ కేంద్రమంత్రివర్యులు వేణుగోపాలాచారి ,విశ్రాంత జడ్జి మధుసూదన్, న్యూ కంబాల శివలీలారెడ్డి,సురభి శంకర శర్మ అష్టావధాని,జర్నలిస్ట్&ఫ్యామిలీ మోటివేటర్ నీలాజ్యోతి చేతులమీదుగా అంబేద్కర్ సేవా జాతీయ పురస్కారం 2026 అవార్డు గ్రహిత దుర్గా భవాని కు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అవార్డు గ్రహిత దుర్గాభవాని మాట్లాడుతూ పాత్రికేయురాలిగా, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైసరుగా,హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శిగా,సోషల్ వర్కరుగా వివిధ సేవలకు గాను అంబేద్కర్ జయంతి సందర్భంగా డా.బి.ఆర్.అంబేద్కర్ సేవా జాతీయ పురస్కారం అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.అందుకు కార్యక్రమ నిర్వాహకులు డా.చక్రవర్తి కు ప్రత్యేక అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా ఈ కార్యక్రమ చీఫ్ అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించిన జర్నలిస్ట్,సామాజిక నేత దుర్గాభవాని ద్వారా విశ్రాంత జిల్లా కలెక్టర్ గా మరియు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో గా విధులు నిర్వహించిన లక్ష్మీకాంతం(ఐఏఎస్),విశ్రాంత ఎస్పి ఎస్.ఎం.రత్న లను ఆహ్వాణించడం జరగడమే కాకుండా వీరి చేతులచే అవార్డు గ్రహితలకు అవార్డులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహితలు జర్నలిస్ట్,ఫ్యామిలీ మోటివేటర్నీ లాజ్యోతి,డా.శివలీలరెడ్డి,సోమవార్అన్నపూర్ణ,సంతోషి,విజయలక్ష్మి అవార్డు గ్రహిత దుర్గాభవాని కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.