బాలాజీనగర్ లో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు.

తేది:16-01-2026 హన్మకొండ TSLAWNEWS
నియోజకవర్గం ఇన్చార్జ్ దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: సుమారు 150 మందికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి తీసుకున ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా అధ్యక్షుడు అయూబ్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోన బాలాజీనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాహిత కార్యక్రమాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు జిల్లా అధ్యక్షుడు అయూబ్ నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నందుకే ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలనుప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ విధానమని, రానున్న రోజుల్లో వర్ధన్నపేట నియోజకవర్గంతో పాటు గ్రేటర్ వరంగల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ చేరికల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *