నిర్మాత, జర్నలిస్ట్, పీఆర్వో బి.ఎ.రాజు మరణం పట్ల పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. ”చెన్నైలో ఉన్నప్పటి నుంచీ రాజుగారితో పరిచయం ఉంది. సినిమా అంటే ఎంతో తపన కలిగిన జర్నలిస్ట్ ఆయన. అన్నయ్య చిరంజీవిగారి చిత్రాలకు పీఆర్వోగా పనిచేశారు. సూపర్‌హిట్ పత్రిక సంపాదకులుగానే కాకుండా నిర్మాతగానూ పరిశ్రమలో నిలబడ్డారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా” అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.