హైదరాబాద్ లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్..!

హైదరాబాద్ నగరవాసులకు నిజంగా ఇది ఓ శుభవార్తే..నగరవాసుల కష్టాలు తీరినట్లే..జీహెచ్ ఎంసీ కమిషనర్ గా కొత్గగా పదవీబాధ్యతలు చేపట్టారు అమ్రపాలి. సిన్సియర్ అధికారిగా పేరు సంపాదించుకున్న అమ్రపాలి గ్రేటర్ పాలనా సంస్కరణలు చేపట్టారు. వచ్చీరాగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జీహెచ్ ఎంసీ కార్యాలయాల చుట్టూ ఇన్నాళ్లు తిరుగుతూ పబ్లిక్ నానా అవస్థలు పడుతున్నారు. జీహెచ్ ఎంసీ పర్మిషన్లు, బిల్లులు కట్టాలంటే క్యూ లైన్లలో గంటల తరబడి నుంచోవాల్సిందే. ఇప్పుడా క్యూ లైన్లు అవసరం లేదు క్యూ ఆర్ కోడ్ ఉంటే చాలంటున్నారు జీహెచ్ ఎంసీ కమిషనర్ అమ్రపాలి. ముందుగా గ్రేటర్ పరిధిలోకి వచ్చే ఇళ్లు ఎన్ని ఉన్నాయి? సర్వే చేయించి ఇంటింటికీ ఓ యూనిక్ ఐడీ నెంబర్ కేటాయిస్తారు. వాటికి ఇళ్లముందే గోడలపై ఓ బోర్డు ఏర్పాటు చేసి క్యూఆర్ కోడ్ సహాయంతో చాలా సులభతరమైన సేవలను పొందవచ్చు. అంతేకాదు ఇకపై ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మన ఇంటికే డోర్ డెలివరీ అయ్యేలా ఆన్ లైన్ సేవలను పొందవచ్చు. కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు, ఆస్తి బిల్లులు కట్టుకోవచ్చు.

 

డిజిటల్ బోర్డుల ఏర్పాటు

 

తమ కాలనీలలో ఏదైనా సమస్యలు ఉన్నా నేరుగా జీహెచ్ ఎంసీ కార్యాలయానికి ఫిర్యాదులు ఈ బోర్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు . ముఖ్యంగా వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు తమ కాలనీల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసి తక్షణమే విపత్తు నివారణ చర్యలు చేపట్టవచ్చు. దోమలు,చెత్త, నాలా నీరు రోడ్లమీదకు రావడం వంటి విషయాలను మనకు ఇచ్చిన యూనిక్ నెంబర్ లింక్ చేసి సేవలు పొందవచ్చు.

ముందుగా జీఐఎస్ సర్వే ద్వారా ఇళ్లను సర్వే చేస్తారు. ఈ డోర్ టూ డోర్ సర్వేలో సంబంధిత స్టాఫ్ వచ్చినప్పుడు మన వద్ద ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్, పాన్ కార్డ్ తదితర సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డోర్ టూ డోర్ సర్వేను మొత్తం ఆరువందల టీమ్ మెంబర్స్ ను యుద్ధ ప్రాతిపదికన నియమిస్తున్నారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా ఒక్కో ఇంటికీ ఒక్కో క్యూ ఆర్ బోర్డు కేటాయిస్తారు

 

యుద్ధ ప్రాతిపదికన చర్యలు

ఈ ప్రక్రియ అంతా ఆరునెలలలోగా పూర్తిచేయాలని నగర కమిషనర్ అమ్రపాలి ఆదేశాలిచ్చారు. ఇకపై జీహెచ్ ఎంసీ నుంచి ఎలాంటి సేవలు కావాలని అనుకున్నా..ఇంటి వద్దే అన్నీ పొందేలా జీహెచ్ ఎంసీ కమిషనర్ అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సిటీ పరిధిలో ఎక్కడెక్కడ వరద నీరు నిలిచే ప్రదేశాలు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండి నేరుగా నాలాకు కనెక్ట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ చెరువులు కబ్జాకు గురవుతున్నాయని..కాలనీలలో ఆక్రమణలకు గురైన పార్కులు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి ఇంటికీ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందించేందుకు వీలవుతుంది. అలాగే ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా ఇంటి వద్దకే అన్ని రకాల సేవలను పొందేందుకు ఉపయోగకరంగా ఉంటుం్ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *