- వెటర్నరీ ఆసుపత్రులు, పాథలాజికల్ లాబొరేటరీస్‌కి గ్రీన్ సిగ్నల్
- శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి
లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం వాటిని ప్రకటించింది. హెల్త్‌కేర్ రంగంలో వెటర్నరీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పాథలాజికల్ లాబొరేటరీస్, వ్యాక్సిన్, ఔషధాల అమ్మకాలు, సరఫరాలపై నిబంధనలు సడలించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రవాణా రంగంలో శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వీరు విమాన ప్రయాణాలు చేయవచ్చు. షెల్టర్ హోంలో దివ్యాంగులు, మానసిక వైకల్యంతో బాధ పడుతున్న వారు, చిన్న పిల్లలు, వితంతు, వృద్ధాశ్రమాల్లో అన్ని కార్యక్రమాలు కొనసాగేలా అనుమతులు ఇచ్చింది.