తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతరుల సర్వీసు ఆధారంగా వేతన పెరుగుదలను అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉద్యోగుల పదేళ్ల సర్వీసును బట్టి రూ.5,851 నుంచి రూ.8,468 పెరిగే అవకాశం ఉంది. 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రూ.9,540 నుంచి రూ.14,314 పెరుగుతుందని అంచనా వేశారు. పైఅధికారులకు భారీగా పెరిగే అవకాశముంది.