పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరల్లో స్థిరత్వం వచ్చినప్పుడే ధరల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. తరచూ ఎక్కడో ఓచోట దాడులు జరుగుతుండటంతో చమురు మార్కెట్లో అస్థిరత నెలకొని ధరలు తగ్గటం లేదని చెప్పారు. అయినా 23 నెలలుగా ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలు తగ్గించి వాహనదారులకు ఊరట కలిగిస్తున్నామని పేర్కొన్నారు.