జంట నగరాలతో పాటు నార్త్ తెలంగాణలోని 5 జిల్లాల్లోని ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ హైవే 44పై రూ.1580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5320 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మెట్రో మార్గాన్ని కూడా నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ కు తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కానుంది. కండ్లకోయ జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది.
సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ నుంచి మొదలయ్యే కారిడార్.. తాడ్ బండ్ జంక్షన్, బెయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ వద్ద ముగుస్తుంది. కారిడార్ మొత్తం పొడవు 5320 కిలోమీటర్లు. ఎలివేటెడ్ కారిడార్ పొడవు 4650 కిలోమీటర్లు. ఇందులో 0.600 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది. మొత్తం 131 పిల్లర్లతో ఆరు వరుసలతో కారిడార్ ను నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై రాకపోకలు సాగించేలా బెయినపల్లి జంక్షన్ సమీపంలో రెండు ప్రాంతాల్లో ర్యాంపులు నిర్మించనున్నారు. కారిడార్ నిర్మాణం పూర్తయ్యాక దానిపై మెట్రోమార్గాన్నీ నిర్మిస్తారు.
ఎలివేటెడ్ కారిడార్ కు అవసరమైన భూమి 73.16 ఎకరాలు
ఇందులో రక్షణశాఖ భూమి 55.85 ఎకరాలు
ప్రైవేట్ ల్యాండ్ 8.41 ఎకరాలు
అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణానికి 8.90 ఎకరాలు
నేషనల్ హైవే 44లో సికింద్రాబాద్ సహా.. ఆదిలాబాద్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి
నగరం నుంచి ఓఆర్ఆర్ వరకూ ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం
మేడ్చల్ – మల్కాజ్ గిరి – మెదక్ – కామారెడ్డి – నిజామాబాద్ – నిర్మల్ – ఆదిలాబాద్ కు ప్రయాణికుల, సరకు రవాణా వేగంగా చేరుకుంటుంది.