‘హనుమాన్’ మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాలో ఈ మూవీ హిందీ వర్షను విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తొలుత మార్చి 2 నుంచి ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రసారం కానుందని జోరుగా ప్రచారం జరిగింది. చివరకు 16న విడుదలవుతోంది.