నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న ఇందిరా భవన్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి వినతిని మంత్రి స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యల స్వభావాన్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అర్జీలపై తక్షణమే స్పందించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.