ముకుందాపురంలో మహిళా సంఘ బంధ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో మహిళా సంఘ బంధ భవనాన్ని ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ మహిళల అభివృద్ధికి ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం కేంద్రంగా నిలిచి, స్వయం ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, సమభావన సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.