విడుదలకు ముందే ‘కొరియన్ కనకరాజు’కు భారీ బిజినెస్.. నాన్-థియేట్రికల్ హక్కులతోనే రూ.26 కోట్ల రికవరీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే భారీ బిజినెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్, ఆడియో, హిందీ డబ్బింగ్ హక్కులు కలిపి దాదాపు రూ.26 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, కేవలం నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే పెట్టుబడిలో అధిక భాగాన్ని రికవరీ చేసుకోవడం విశేషంగా మారింది.

ఇక థియేట్రికల్ హక్కుల ద్వారా మరో రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.