పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండల కృష్ణగిరి మోడల్ స్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్ 4.0 కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి విద్య ప్రాధాన్యతపై ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, వెనుకబడిన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే శాశ్వత మార్గమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం తమ పిల్లలకు తప్పనిసరిగా విద్య అందించాలని, విద్య ద్వారానే సమాజంలో స్థిరమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆడపిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు.