‘బటవారా 1947’కు సీబీఎఫ్‌సీ గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం బటవారా 1947 విడుదలకు సిద్ధమైంది. 1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలాంటి కట్స్ లేకుండా క్లియరెన్స్ ఇచ్చింది.

ప్రముఖ నాటక రచయిత అస్గర్ వజాహత్ రాసిన ప్రసిద్ధ నాటకం జిస్ లాహోర్ నై వెఖ్యా, ఓ జమ్యా ఎ నై ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి కోతలు లేకుండా సర్టిఫికేట్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. దేశ విభజన నేపథ్యంలో భావోద్వేగభరిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.