1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక మిలిటరీ డ్రామా సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ట్రైలర్‌ను మేకర్స్ ఘనంగా విడుదల చేశారు. జిమ్మీ షెర్గిల్, సిద్ధార్థ్, బరుణ్ సోబ్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సోమవారం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదలైన ట్రైలర్ యుద్ధభూమిలో భారత సైనికుల ధైర్యసాహసాలను, దేశభక్తిని ప్రతిబింబించేలా రూపొందింది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కార్గిల్ యుద్ధ సమయంలో జరిగిన కీలక పరిణామాలను ఆసక్తికరంగా చూపించనున్నారు.
‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభించగా, యుద్ధ నేపథ్య కథలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది.