తేది:28-04-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్‌లో వంశీ టీవీ సీఈఓ వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, హ్యూమన్ రైట్స్ కార్యకర్త పారువెల్లి దుర్గ భవాని కి “బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు” ప్రదానం చేశారు.
జర్నలిస్ట్‌గా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, మహిళల హక్కులు, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్నందుకు ఆమెను ఈ అవార్డుతో సత్కరించారు.
అలాగే మీడియా రంగంలో నిష్పక్షపాత వార్తా కథనాలు అందిస్తూ ప్రజలకు చేరువ కావడం, యువతకు స్ఫూర్తిగా నిలిచే విధంగా సేవలు అందించడం ఆమె ప్రత్యేకతగా నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొని ఆమె ని అభినందించారు. సమాజంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.
అవార్డు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, తనకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులు, సహచరులు, మిత్రులు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా జర్నలిజం మరియు సామాజిక సేవా రంగాలలో మరింత సేవాభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.