తేది:16-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా : మల్యాల పోలీస్ స్టేషన్లో సెక్షన్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ కృష్ణ కుమార్ గురువారం ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ, నిజాయితీగా నిబద్ధతతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును సొంతం చేసుకున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ కుమార్ తో పాటు, పలువురు పోలీస్ సిబ్బంది ఆయనను అభినందించారు.