తేది: 16-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జగిత్యాల ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి శ్రీమతి సి. సునీత రవీందర్ రెడ్డి గురువారం బాధ్యతలను ఘనంగా స్వీకరించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వేదమంత్రాలతో జడ్జి దంపతులను ఆహ్వానించారు. అనంతరం వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామివారి సాక్షిగా జడ్జి తన బాధ్యతలను స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ స్థానాచారి కపిందర్ జడ్జి దంపతులకు శేషవస్త్రం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు అధికారులు, స్థానిక ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ రమణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.