ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి – జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

తేది:16-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

జగిత్యాల జిల్లా : జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా నిలిచేలా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్రం లో జిల్లాను అగ్రగామిగా నిలపాలని సూచించారు.
మండల స్థాయిలో జరిగే సమావేశాల నేపథ్యంలో గురువారం మేడిపెల్లి మండలంలోని పి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ లో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయగ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల వారిగా లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని సూచించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు రుణాలు, కార్పొరేషన్ల ద్వారా అందించిన రుణాలు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలపై అర్హులైన ప్రజలకు ప్రత్యేకంగా వివరించాలన్నారు.మండలాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, రైతు సంక్షేమం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు. జగిత్యాల జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టే విధంగా సమావేశాలను నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, మేడి పెల్లి మండలం స్పెషల్ ఆఫీసర్ సురేంద్ర కుమార్, తహసీల్దార్ మునింధర్, ఎంపీడీవో గంగాధర్ , స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *