రామమందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ.

తేది: 14-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా : మల్యాల మండల కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున నిధులను స్వచ్ఛందంగా అందజేస్తున్నారు. నిధుల సేకరణను ప్రారంభించి నేటితో రెండు రోజులు పూర్తికాగా మొదటిరోజు రూ. 5 లక్షలు అందజేశారు. అలాగే నేడు మరో రూ. 5 లక్షల నిధులను సేకరించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *