తేది:14-04-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: మండలంలోని వివిధ గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని అంబేద్కర్ విగ్రహాలకు మరియు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు.
ప్రసంగాలు: దళిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. “చదువుకో, సమీకరించుకో, పోరాడు” అనే ఆయన పిలుపును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో స్థానిక సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ, ఆయన చూపిన బాటలో నడవాలని వక్తలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.