ఏఐ కెమెరా ఫోన్ల హవా.. ఫోటోగ్రఫీలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు

మొబైల్ ఫోటోగ్రఫీ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) కొత్త విప్లవానికి తెరలేపింది. కేవలం అధిక మెగాపిక్సెల్స్ మాత్రమే కాకుండా, ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లతో మరింత స్పష్టమైన, సహజమైన చిత్రాలను అందించే స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 17 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్లు ఈ జాబితాలో ముందంజలో ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో సిస్టమ్ లెవెల్ ఏఐ సాంకేతికతను అందించి ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరిచింది. తక్కువ వెలుతురులో కూడా లైటింగ్, ఎక్స్‌పోజర్‌ను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తూ సహజ రంగులతో స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది. అలాగే సీన్ రికగ్నిషన్, ఆటో ఫోకస్ వంటి ఏఐ ఫీచర్లు ఫ్రేమ్‌లోని సబ్జెక్ట్‌ను గుర్తించి ఉత్తమ ఫలితాలను అందిస్తాయి.

ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో పాటు శామ్‌సంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా, గూగుల్ పిక్సెల్ సిరీస్, షావోమీ, వివో వంటి బ్రాండ్లు కూడా అధునాతన ఏఐ కెమెరా ఫీచర్లతో వినియోగదారులకు ప్రొఫెషనల్ స్థాయి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు మరింత తెలివిగా మారుతూ, ఫోటోగ్రఫీలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తున్నాయి.