తేది :14-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా : రాయికల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” (Arrive Alive) రోడ్డు భద్రతా వారోత్సవాల సదస్సును నిర్వహించారు.పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టడానికి వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మరియు అతి వేగాన్ని నియంత్రించుకోవాలని తెలిపారు.రోడ్డు భద్రత మనందరి బాధ్యత’ అనే నినాదంతో ప్రజలల్లో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు రహదారి నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా గమ్యాన్ని చేరుకుందాం అని ఎస్.ఐ సుధీర్ రావు పేర్కొన్నారు
అనంతరం ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీంధర్, మున్సిపల్ కమీషనర్ కీర్తి నాగరాజు, ఆర్ ఐ దేవదాస్ పద్మయ్య,అంబేద్కర్ సంఘం నాయకులు గుఱ్ఱం రత్నాకర్,మారంపల్లి సాయికుమార్ ,పుర్రె శ్రీనివాస్,లింగంపల్లి
రాజేష్,బాపురపు నర్సయ్య,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మనాటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు అల్లె పురుషోత్తం,
కలమడుగు రమేష్, అజ్జు,కౌన్సిలర్ కల్లెడ ధర్మపురి,భూక్యా రాకేష్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.