తేది:14-04-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా : సామాజిక, స్వేచ్ఛను, సాధించనంత కాలం, చట్టం ద్వారా అందించే ఏ స్వేచ్ఛా మీకు ఉపయోగపడదు.
డాక్టర్ బి,ఆర్.అంబేద్కర్ మహానగరపాలక సంస్థ పరిధిలోని 16 వ డివిజన్ ధర్మారం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం నిర్మాణ శాఖ వారి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు గ్రామ పెద్దలు ప్రముఖులు మాజీ సర్పంచులు ఎంపిటిసిలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై అంబేద్కర్ గారికి గజ మాలతో మాజీ అధ్యక్ష కార్యదర్శులు కొమ్ముల సురేష్ కుమార్ వల్లెం సుధాకర్ గార్లు సత్కరించి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ మన ఆలోచన మారితేనే మన సమాజం మారుతుంది.