నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ABSF,MSF,SSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సెకండ్ గేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.

తేది:23-01-2026 హన్మకొండ TSLAWNEWS
పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ కెయూ గ్రంధాలయం దగ్గర నుండి కెయూ సెకండ్ గేట్ వరకు ఏభిఎస్ఎఫ్ ఎమ్ఎస్ఎఫ్ ఎస్ఎస్ యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీసి గేట్ ముందే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తేది:21-01-2026 నాడు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఏభిఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్, ఎంఎస్ఎఫ్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు కుమ్మరి శ్రీనాథ్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రములో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు సంత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ ని నమ్మి కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేస్తె తెలంగాణా రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణాకు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి అయ్యారు కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతుందని అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల మీద పోలీస్ లతో లాఠీ చార్జ్ చేయిస్తున్నారనీ అన్నారు నిరుద్యోగులను వాడుకొని గద్దెనెక్కిన రేవంత్ అధికార మదంతో విర్ర విగుతు నిరుద్యోగుల రక్తం కళ్ళ చూస్తున్నాడని కొత్త నోటిఫికేషన్లు రాకపోగా అభయ హస్తం లో ఇచిన హామీలన్నీ నీటి బుడగలై తేలిపోయాయని అన్నారు. ప్రజా పాలన పేరిట ప్రజా వంచనకు పాల్పడుతున్న రేవంత్ సర్కారు కు తగిన గుణపాఠం నేర్పే రోజు దగ్గర పడిందన్నారు నిర్బంధాలు మాని, నిరుద్యోగ న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థి నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడకుండా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే మాత్రం మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ ఓడించడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏభిఎస్ఎఫ్ కెయూ అధ్యక్షులు అడ్డా రాజేష్ ,ప్రధాన కార్యదర్శి రాయరాల నరసింహ ఉపాధ్యక్షులు చల్ల శ్రీకాంత్, ఉదయ్, సాయి, చంటి, కళ్యాణి, ప్రసన్న ,అపర్ణ, కృష్ణ, వేణి ,పల్లవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *