తేది:23-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
శ్లోకం: యా కుందేందు తుషార హార ధవలా యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా ॥
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైః సదా పూజితా ।
సా మాం పాతు సరస్వతి భగవతీ నిఃశేష జాడ్యాపహా ॥
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం : వసంత పంచమి ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథినాడు జరుపుకుంటారు.
ఈ పండుగ వసంత ఋతువు ఆగమనానికి సూచికగా వసంత పంచమి రోజు నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది.
అలాగే వసంత పంచమి ఈ రోజున జ్ఞానదేవత అయిన సరస్వతి దేవి అవతరించిందని పురాణ విశ్వాసం.
సరస్వతీ దేవికి అంకితమైన పవిత్రమైన రోజు. సరస్వతీ దేవి విద్య, జ్ఞానం, వాక్చాతుర్యం, కళలకు అధిదేవత. బ్రహ్మదేవుని సహధర్మచారిణి సరస్వతీ, లక్ష్మీ, పార్వతీ — ఈ ముగ్గురు దేవీమూర్తులు మూలప్రకృతి లేదా ఆది పరాశక్తి యొక్క వివిధ అవతారాలుగా విశ్వసించబడతారు.
ఈ రోజున సరస్వతీ దేవిని విశేషంగా పూజిస్తారు. విద్యకు గొప్ప ప్రాధాన్యం కలిగిన ఈ పంచమి రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.
వసంత పంచమికి పసుపు రంగు ప్రధానమైనది. పసుపు జ్ఞానాన్ని,సౌభాగ్యాన్ని,ఉత్సాహాన్ని, ధాన్య సంపదను కలిగిస్తుంది.
ఆధ్యాత్మికంగా వసంత పంచమి చెప్పేది:
వసంతం ప్రకృతికి ఎలా నూతన జన్మనిస్తుందో,
ఈ రోజు మనలోని బుద్ధికి కూడా నూతన వికాసాన్ని కలిగిస్తుందని అనే భావన.
శ్రీ మాత్రే నమః శ్రీ సరస్వత్యై నమః