తేది:22- 01- 2026 హైదరాబాద్ TSLAWNEWS ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్: సహకార్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని “జాతీయ యువజన దినోత్సవం–2026” సందర్భంగా తెలంగాణ సరస్వత పరిషత్, కింగ్ కోటి, హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డులు–2026 ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమాజ సేవ, ఆర్థిక అవగాహన, మీడియా రంగాల్లో విశేష సేవలు అందించినందుకు గాను
డా.పారువెల్లి అంక విజయ దుర్గ భవానికి
స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు–2026ను ప్రదానం చేశారు.
ఆమె లైఫ్, హెల్త్ అండ్ జెనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా, అలాగే పత్రిక ప్రతినిధి గా పనిచేస్తూ, ప్రజలకు ఆర్థిక భద్రతపై అవగాహన కల్పించడంలో, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఆదర్శంగానిలుస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్. మధుసూదన చారి , ప్రత్యేక అతిథులుగా శాసనమండలి సభ్యులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు హాజరై అవార్డు గ్రహీతలను అభినందించారు.అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందని, సమాజ సేవలో ఇంకా చురుకుగా ముందుకు సాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.