విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారితో భేటీ అయిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, కంటెస్టెడ్ మెదక్ ఎంపీ గొల్లపల్లి సాయి గౌడ్ మరియు ఎమ్మార్పీఎస్ నాయకుడు రత్నయ్య.

తేది:23-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్, విద్యానగర్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారితో భేటీ అయిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, మెదక్ కాంటెస్ట్ ఎంపీ గొల్లపల్లి సాయ గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు రత్నయ్య, మరియు టీఎస్ లా న్యూస్ రిపోర్టర్ దేవచిత్తం. ఇట్టి సందర్భంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుయే మన దేశ భవిష్యత్తు అని కోరుకుంటూ విద్యార్థులకు సరైన విద్య అందించడం మన బాధ్యత అని విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని వర్గాల వారికి విద్యా అందుబాటులో ఉండే విధంగా చూడడం అది మన బాధ్యత అని పేర్కొంటూ విద్యార్థులకు ఎక్కడ సమస్యలు వాటిల్లిన విద్య హక్కు చట్టం ప్రకారం, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను అనుసరించి విద్యార్థులకు న్యాయం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *