క్రీడల ద్వారా ఆరోగ్యం మానసిక ఉల్లాసం, అల్లాదుర్గ్ మండల పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామములో శోభ రుక్మారెడ్డి జ్ఞపకార్థం మాజీ ఎంపిటిసి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్.

తేది:16- 01- 2026 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

సంగారెడ్డి జిల్లా : అల్లాదుర్గ్ మండల పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామములో శోభ రుక్మారెడ్డి జ్ఞపకార్థం
మాజీ ఎంపిటిసి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలోవిలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ గురువారం ఏర్పాటు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి ఎస్ఐ శంకర్ కలిసిటాస్ వేసి తొలి ఆటను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులకు క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం
శారీరకధృఢత్వ ని క్రమశిక్షణనీ పెంచుతాయని పేర్కొన్నారు. గెలుపు ఓటముల కంటే క్రీడ స్ఫూర్తితో ఆడటం ముఖ్యమని యువతకు సూచించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ హరికృష్ణ, మాజీ ఎంపీటీసీ విట్టల్ రెడ్డి, అభిలాష్ రెడ్డి ,రోషన్, జైపాల్, జోగినాథ్,క్రీడాకారులు నాయకులు తదితరులు పాలుగోన్నారు.
అనంతరం అదే రోజు కాగితంపల్లి సర్పంచ్ వంకిడి రేణుక సిద్దు ఆధ్వర్యంలో వన్డే క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంకిడి సిద్దు బాల్రాజ్ సంగమేశ్వర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *