

తేదీ: 24-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
అమీన్పూర్: జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్పూర్ ప్రాంతం వందనపురి కాలనీ రోడ్–1, రోడ్–2, రోడ్–3 ప్రాంతాల్లో గురువారం జ్యోతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కమిషనర్‌తో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.
కాలనీలో నివసిస్తున్న ప్రజలను కమిషనర్ నేరుగా కలుసుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులపై స్థానికులు చేసిన ఫిర్యాదులను కమిషనర్ గమనించారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, వందనపురి కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పర్యటన నిర్వహించబడిందని తెలిపారు.