Amit Shah: తమిళనాడులో అమిత్ షా పర్యటన.. మామల్లపురంలో 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం

 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తమిళనాడులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మామల్లపురంలో 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఆయన అధ్యక్షతన జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఏయే రాష్ట్రాలు పాల్గొంటాయి?

దక్షిణాది ప్రాంతీయ మండలిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి.

ఈ ప్రాంతీయ మండలి సమావేశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చిస్తారు.