School Holidays: కుక్కల బెడదతో 10 స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు.. ఆన్‌లైన్‌లో క్లాసులు

 

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా నారాయణబగడ్ ప్రాంతంలో వీధి కుక్కలు, హింసాత్మక కుక్కల బెడద పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు.

ఆగస్టు 20 నుంచి 23 వరకు పాఠశాలలకు సెలవులు

చమోలీ ముఖ్య విద్యాధికారి ఆకాష్ సరస్వత్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలకు ఆగస్టు 20, 2026 నుంచి ఆగస్టు 23, 2026 వరకు సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో విద్యార్థులను పాఠశాలలకు రప్పించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల పాటు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే వారి విద్య కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.