
తేది:24-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలో 2025 లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత చర్యలు మరియు సాధించిన ప్రగతిని మంగళవారం రోజున జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ వార్షిక ప్రెస్‌మీట్ ద్వారా వివరాలను వెల్లడించారు.
గత సంవత్సరం జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారు. పండుగలు, ఎన్నికలు, జాతరలు, భారీ సమావేశాల సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం జరిగింది. జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముఖ్యంగా హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్, ఆన్‌లైన్ మోసాలు వంటి కేసుల్లో నేరస్తులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.అదే విదంగా పెండింగ్ కేసుల పరిష్కారంలో కూడా గణనీయమైన పురోగతి సాధించాం.మహిళలు, బాలల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది,ఇందుకోసం షీ టీమ్స్ ,AHTU, భరోసా సెంటర్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మహిళలపై జరిగే నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాం.అదే విదంగా జిల్లా పోలీస్ శాఖ ద్వారా సురక్షిత ప్రయాణం, పోలీస్ పాఠశాల వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో విజయం సాధించాం.టెక్నాలజీని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ దిశగా అడుగులు వేయడం జరిగిందని ,CCTV నెట్‌వర్క్, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకున్నాం అన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడం మరియు ప్రజలకు మెరుగైన భద్రత సేవలు అందించడంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అహర్నిశలు కష్టపడి చేసిన సేవలు ఉన్నాయి అని వారి నిబద్ధతకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.అదే విదంగా జిల్లా ప్రజలు, మీడియా, పోలీసులకు అందిస్తున్న సహకారం అభినందనీయం అని భవిష్యత్తులో కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని అన్నారు.
2026 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ, స్నేహపూర్వక పోలీసు విధానాన్ని అవలంబిస్తూ, జిల్లా పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని తెలుపుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పి శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్, డిఎస్పి లు వెంకటరమణ, రఘు చందర్, రాములు ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.