తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ నాలుగు సంవత్సరాల వరకు రాయితీ సదుపాయం- ఉద్యాన శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్.

తేది:23-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా : ఉద్యాన శాఖ జగిత్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున కొడిమ్యాల మండలంలో పూడూరు గ్రామంలోని రైతు వేదిక లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తున్న రైతులు అందరూ ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ వివరించారు. ఆయిల్ ఫామ్ లో చేపట్టవలసిన సాగు పద్ధతులు అంతర పంటల వివరాలు చీడపురుగుల నివారణ చర్యలు మరియు మార్కెటింగ్ గురించి వివరించారు. ఆయిల్ పామ్ పంట సాగు, దిగుబడి మరియు మార్కెటింగ్ గురించి రైతులకు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ నాలుగు సంవత్సరాల వరకు రాయితీ సదుపాయం కల్పిస్తున్నందున రైతులు నిర్భయంగా ఆయిల్ ఫాం సాగు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగులో ముందు నిలిచి రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని కోరడం జరిగింది.మూడు సంవత్సరాల తర్వాత గెలలు కోతకు రావడం జరుగుతుందని, ఒక్కసారి కోత ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 30 నుండి 35 సంవత్సరాల వరకు సంవత్సరం పొడవునా దిగుబడి తీసుకుంటూ రైతులు సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం లాగా ఆదాయాన్ని పొందవచ్చని తెలపడం జరిగినది. ఈ సందర్భంగా మీటింగ్ కు విచ్చేసినటువంటి పూడూర్ గ్రామ సర్పంచ్ కడారి మల్లేశం, ఉప సర్పంచ్ ఎడమలపెళ్లి సంతోష్, వార్డు మెంబర్లను ఆయన సన్మానించి ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను ప్రోత్సహించవలసిందిగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో AEO రాజేష్, HEO అనిల్ మరియు లోహియా ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రతినిధి లక్ష్మణ్ మరియు పూడూరు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *