నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం చేయాలి – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్.

తేది:23-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.

మెదక్ జిల్లా: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.
ప్రత్యేకంగా లాంగ్ పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించిన ఎస్పీ గారు, వాటి వేగవంతమైన చేధనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం లేకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు.
ఈ జిల్లా క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ గారు కూడా పాల్గొని, కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులతో చర్చించారు. ప్రజల విశ్వాసం పోలీస్ వ్యవస్థపై మరింత పెరగాలంటే, ప్రతి కేసును బాధ్యతతో, పారదర్శకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ గారు పేర్కొన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తేలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *