యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాల గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అందులో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” కాగా.. మరోకటి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో “సలార్”. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. సలార్ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్‏ను చిత్రయూనిట్ రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే సలార్ మూవీలో ప్రభాస్ కు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలోని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ కీలక పాత్ర లో ఆ అమ్మడు కనిపించనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్ నడుస్తోంది.

ఈ చిత్రాన్ని కేజీఎఫ్ మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది. డార్లింగ్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా నటించిన “రాధేశ్యామ్” సినిమా షూటింగ్ పూర్తైందని.. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఆ మూవీ సెట్స్ పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *