హిండెన్‌బర్గ్ Vs సెబీ చీఫ్‌..!

అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్-సెబీ చీఫ్ మాదభి పురి బచ్ వ్యవ హారం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె నిరూపించు కోవాలని సవాల్ విసిరింది హిండెన్‌బర్గ్. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

 

హిండెన్‌బర్గ్-సెబీ చీఫ్ మాదభి పురి బచ్‌పై ఆరోపణల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సెబీ విశ్వసనీయతపై దాడి చేసింది, తమ వ్యక్తిత్వ హననానికి ఆ సంస్థ ప్రయత్నం చేస్తుందంటూ మాధబి, ఆమె భర్త ధావల్ చెప్పిన నిమిషాల వ్యవధిలో హిండెన్‌బర్గ్ రియాక్ట్ అయ్యింది.

 

బెర్ముడా, మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్లలో తనకు పెట్టబడులు ఉన్నట్లు మాధబి అంగీకరించారన్నది హిండెన్‌ బర్గ్ ప్రధాన ఆరోపణ. అదానీ సంస్థలో డైరెక్టర్‌గా తన భర్త ఆ ఫండ్స్ ను నిర్వహించినట్టు ఆమె అంగీకరిం చారని హిండెన్‌బర్గ్ వెల్లడించింది.

 

2017లో మాధబి సెబీలో చేరాక.. భారత్- సింగపూర్‌ల్లో ఏర్పాటు చేసిన కన్సల్టింగ్ కంపెనీల కార్య కలాపాలు ఆపేసినట్టు ఆమె స్వయంగా వెల్లడించారన్నది హిండెన్‌బర్గ్ ఆరోపణ. రెండేళ్ల తర్వాత ఆమె భర్త టేకోవర్ చేశారని నమ్మబలికారు. ఈ ఏడాది మార్చి చివరినాటికి అగోరా అడ్వయిజరీలో మాధబి‌కి 99శాతం వాటా ఉంది.

 

అదే సింగపూర్‌లో అయితే 2022 నాటికి ఆమె 100శాతం వాటా ఉందని చెబుతోంది. సెబీ ఛైర్‌పర్సన్‌గా మాధబి నియామకం జరిగిన రెండు వారాల తర్వాత తన వాటాను భర్తకు బదిలీ చేశారని తెలిపింది. ఆమె అధికారిక హోదాలో ఉంటూ మరేదైనా వ్యాపారం తన భర్త పేరు మీద నిర్వహించారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని మాధబి నిరూపించుకోవాలని ఛాలెంజ్ విసిరింది హిండెన్‌బర్గ్.

 

మరోవైపు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. మొత్తం ఎపిసోడ్‌పై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్నది కాంగ్రెస్ డిమాండ్. గతంలో అదానీ వ్యవహారంపై తాను సెబీకి లేఖ రాశానని, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదున్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. రెండు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఇప్పటికి 18 నెలలు గడిచిందని, విచారణ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.

 

కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై బీజేపీ రియాక్ట్ అయ్యింది. మార్కెట్లను కుప్పకూల్చాలని కాంగ్రెస్ భావిస్తోందని దుయ్యబట్టింది. అదానీ కంపెనీలపై జేపీసీ కోరడం అర్థరహితమని వ్యాఖ్యానించింది. ఒక విధంగా పెట్టుబడుదారులను రాకుండా చేయాలన్నది ఆ పార్టీ ఆలోచనగా చెప్పారు మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *