పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్..

తెలంగాణలో స్వాతంత్య్ర సంబరాల కోసం గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఈసారి చారిత్రక గోల్కొండ కోట వద్ద త్రివర్ణ పతాకం ఎగరేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఎగరేయనున్నారు. ఇందుకోసం గోల్కొండ కోట ముస్తాబవుతోంది.

 

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత గోల్కొండలో ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి పర్యవేక్షించారు. అంతే కాదు ఒకవేళ వర్షం వచ్చినా వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ పై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పగడ్బంధీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి తెలియజేశారు. ఏటా తెలంగాణాలో గోల్కొండలోనే స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. జెండా వందనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ నేతలు హాజరుకావడంతో అనేక భద్రత ఏర్పాట్లు నిర్వహించాలని సీఎస్ ఆదేశించింది. కాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా సంస్కృతిగా బృందాల ప్రదర్శన ఉండబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *