రోజు రోజూకూ పడిపోతున్న వైసీపీ గ్రాఫ్..! చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై నోరు విప్పారు సీఎం చంద్రబాబు. ప్రజల్లో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని, అందుకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 39.81 శాతం ఓట్లు రాగా, స్థానిక ఎన్నికల్లో 33. 56 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అదే సమయంలో కూటమికి వచ్చిన ఓట్ల శాతాన్ని బయట పెట్టారు. 2024 ఎన్నికల్లో కూటమికి 55. 3 శాతం రాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 58.9 శాతం వచ్చిందన్నారు. గడిచిన రెండేళ్లలో వైసీపీ ఓట్ల శాతం 6.2 శాతం తగ్గిందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందన్నారు సీఎం చంద్రబాబు. సోమవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. మామూలు ఓట్ల కంటే, ఉద్యోగులు ఎక్కువగా ఓట్లు వేశారన్నారు. 2024 ఎన్నికల కంటే కూటమికి ప్రజాదరణ పెరిగిందన్నారు. అందుకు ఓట్ల శాతం నిదర్శనమన్నారు. ప్రజలు బ్యాలెట్‌తో ఇచ్చిన తీర్పు అని తేల్చేశారు. గొడవల్లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి ఓటు వేశారన్నారు.

అంతకుముందు ఈవీఎంలను మ్యానిప్లేట్ చేశారని మాట్లాడారని వివరించారు. రెండేన్నరేళ్ల పాలనకు ప్రజాస్పందనకు ఇదో ఉదాహరణగా చెప్పారు. కూటమి విజయానికి కారణమైన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తు్న్నట్లు తెలిపారు. వైసీపీ జెడ్పీటీసీలు ఖాతా ఓపెన్ చేయని జిల్లాలు ఏడు ఉన్నాయన్నారు. అందులో అనకాపల్లి, విశాఖ, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, మార్కాపురం, పల్నాడు జిల్లాలు ఉన్నాయన్నారు.

ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వివరాలు బయటపెట్టారు సీఎం చంద్రబాబు. పట్టణ ఎన్నికల్లో కూటమికి 65.70 శాతం వచ్చిందన్నారు. వైసీపీ 27.42 శాతం వచ్చిందన్నారు. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 38.2 శాతం ఉందన్నారు. పరిషత్ ఎన్నికల్లో 62.83 శాతం రాగా, వైసీపీకి 31.43 శాతం వచ్చిందన్నారు. బ్యాలెట్ తో ఎన్నికలకు వెళ్తే రిగ్గింగ్ చేశారన్న మాటలను తోసిపుచ్చారు. అదే సమయంలో కరెన్సీ నోట్ల గురించి మాట్లాడారు. చంద్రబాబు కరెన్సీ సంస్కరణ కోసం ప్రతిపాదన చేశాన్న సీఎం, రూ.500, రూ.2,000 నోట్లను రద్దు చేసి కేవలం రూ.100, రూ.200 నోట్లు ఉండాలన్నారు.

నేరాలు, హింస అనేవి రాజకీయాలని అనుకోవడం తప్పన్నారు. ప్రజా తీర్పు గమనించినవాళ్లు ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. రక్త తర్పణాలు, రప్పారప్పా రాజకీయాలను ప్రజలు ఆమోదించలేదన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. అన్ని జిల్లాల్లోనూ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారన్నారు. ఓ వైపు తుఫాన్లు, మరోవైపు ఎన్నికలు జరుగుతున్నా, ప్రజల కోసం ఆలోచించామన్నారు.  కూటమి పార్టీలు ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. సామాజిక న్యాయం చేయడం ఒకెత్తయితే, జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వడం మరొక ఎత్తుగా చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మంచి వ్యక్తులకు సీట్లు ఇచ్చామని, కచ్చితంగా ఫలితాలు వచ్చాయన్నారు.