ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..! ఇసుక తిన్నెలను వడపోస్తున్న స్థానికులు..!

ఏపీలోపి కాకినాడ జిల్లాలో ఓ సంఘటన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ప్రసిద్ధ ఉప్పాడ సముద్రతీరంలో బంగారం కోసం అక్కడి స్థానికులు వెతకటం మళ్లీ ప్రారంభించారు. దీంతో ఈ సంఘటన ఇప్పడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక వివరాల్లోకి వెలితే.. ఏపీలో ఇప్పటికే తీవ్రంగా తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అలలో బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో అక్కడి స్థానిక మత్స్యకారులు, ప్రజలు తీరప్రాతానికి భారీగా చురుకుని, సముద్రంలోని అలలు తీరప్రాంతానికి వచ్చిన ఇసుక తెప్పలను వలలు, జల్లెడలు చేతపట్టుకుని ఆ ఇసుకును వడపోస్తున్నారు. దాంట్లో బంగారం ఉంటుదనే ఆశతో గాలిస్తున్నారు..

అయితే గతంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటవంటి గ్రామాలు గతంలో అలల దాడికి లోనై సముద్ర తీరంలో ఉన్న పాత ఇళ్లు, పురాతన గుళ్లు, కట్టడాలు సముద్రంలో మునిగిపోయాయి. దీంతో తుఫాను వచ్చే సమయంలో సముద్రంలో ఎగిసి పడుతున్న అలలకు అడుగున ఉన్న ఆభరణాలు, బంగారు పూసలు అలల వేగానికి గురై తీరప్రాంతానికి వస్తయని అక్కడి ప్రాంత ప్రజలు నమ్ముతారు. దీంతో ఇలా వడపోత ద్వారా అవి దొరుకుతాయని నమ్ముతారు.

అయితే అక్కడి స్థానికుల్లో కొంత మందికి చిన్న బంగారం ముక్కలు దొరకంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల మంది అక్కడికి చేరుకుని మహిళలు, పిల్లలు, వృద్ధులు అంతా కలిసి బంగారం కోసం వేటాడుతున్నారు. దీంతో ఓ పక్క అధికారులు సముద్రపు అలలు ఉధృతంగా ఉన్న సమయంలో తీరం వద్ద వెల్లవద్దని చెప్పని వినకుండా అక్కడి ప్రజలు వెల్లడంతో ఇప్పడు ఈ వార్త హట్ టాపిక్ గా మారింది.