TGTET–2026 ప్రాథమిక కీ విడుదల.. అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన TGTET–In-Service Teachers–2026 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధాన పత్రాలతో పాటు ప్రాథమిక కీని అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు.

అభ్యర్థులు తమ సమాధానాలను ప్రాథమిక కీతో సరిపోల్చుకుని సాధ్యమైన మార్కులను అంచనా వేసుకోవచ్చు. ప్రాథమిక కీలో ఏదైనా సమాధానంపై అభ్యంతరం ఉంటే.. అధికారులు సూచించిన విధానంలో అభ్యంతరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రాథమిక కీ, సమాధాన పత్రాలను పరిశీలించేందుకు అభ్యర్థులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. సంబంధిత TGTET–In-Service Teachers–2026 లింక్‌ను ఎంచుకుని అవసరమైన వివరాలతో లాగిన్‌ అయి కీని, సమాధాన పత్రాన్ని పరిశీలించుకోవచ్చు.