మన్నేరువాండ్లపల్లెలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న శివాలయానికి ఆంధ్రప్రదేశ్ రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న శివాలయం నిర్మాణం త్వరగా పూర్తై భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న గ్రామస్థులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.