దావులూరులో ఇరిగేషన్‌ భూములపై అక్రమ వెంచర్ ఆరోపణలు

పెనమలూరు నియోజకవర్గం దావులూరు గ్రామ సచివాలయం పరిధిలో ప్రభుత్వ ఇరిగేషన్‌ భూములపై అక్రమార్కుల కన్ను పడిందన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే భూమిని ఆక్రమించి నాన్‌ లేఅవుట్‌ వెంచర్‌గా అభివృద్ధి చేసి ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారుల పర్యవేక్షణలో విలువైన ఇరిగేషన్‌ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమి ఏ శాఖకు చెందింది, సర్వే నంబర్లు ఏమిటి, రెవెన్యూ రికార్డుల్లో భూమి స్వరూపం ఏంటి అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇరిగేషన్‌ శాఖ ఎన్‌ఓసీ, లేఅవుట్‌ అనుమతులు ఉన్నాయా అనే విషయాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.