తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్, ఉపసర్పంచ్ సప్పిడి ఆంజనేయులు గ్రామంలోని ప్రతి ఇంటికీ మొక్కలను అందజేయాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కలను నాటడం మాత్రమే కాకుండా వాటిని కాపాడినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్, రమేష్, మాజీ వార్డు సభ్యులు వేదం ఉదయ శంకర్, చెరువు జనరల్ సెక్రెటరీ చిల్కం శేఖర్, గ్రామ యువ నాయకుడు పబ్బ సంపత్‌తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్, రమేష్ రాజు, జంగయ్య, నర్సింహా గౌడ్, వినోద్, బతుకమ్మ, పరువాతమ, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.